- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రజత్ పై RCB ఫ్యాన్స్ ట్రోలింగ్.. కెప్టెన్సీ తీసేయండి అంటూ !
ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో (IPL 2025) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు కొత్త టెన్షన్ మొదలైంది. ప్లే ఆఫ్స్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో (IPL 2025) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు కొత్త టెన్షన్ మొదలైంది. ప్లే ఆఫ్స్ చేరిన బెంగుళూరు.. కప్పు గెలవడం అసాధ్యమని... కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుత బెంగళూరు జట్టు ఆట తీరు దారుణంగా తయారయింది. విరాట్ కోహ్లీ , టీమ్ డేవిడ్ లాంటి ప్లేయర్లు కన్సిస్టెంట్ గా ఆడుతున్నప్పటికీ.. మిగిలిన ప్లేయర్లు చేతులు ఎత్తేస్తున్నారు.
బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గెలవాల్సిన మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది బెంగళూరు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రజత్ పటిదర్ ఫిట్ గా లేనని... జితేష్ శర్మకు ( Jitesh Sharma) కెప్టెన్సీ ఇచ్చాడు. దీంతో అక్కడే బెంగళూరుకు పెద్ద నష్టమే జరిగింది. DRS ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితులలో తీసుకోవాలో తెలియని పరిస్థితిలో జితేష్ శర్మ ఉన్నాడు. అలాంటి వాడికి కెప్టెన్సీ ఇచ్చారని బెంగుళూరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తే బాగుండేదని... పటిదర్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. అది పక్కకు పెడితే... కెప్టెన్సీ చేయని రజత్ ( Rajat Patidar) నిన్న బ్యాటింగ్ కు వచ్చాడు. నాలుగో వికెట్ కు వచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 16 బంతుల్లో 18 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. వాస్తవానికి ఆ స్థానంలో టీం డేవిడ్ ను పంపిస్తే.. నిన్నటి మ్యాచ్ లో బెంగళూరు గెలిచి... మొదటి స్థానానికి వెళ్ళేది. కానీ మనోడు అలా చేయలేదు. ఈ దెబ్బకు బెంగుళూరు ఓడిపోవాల్సి వచ్చింది. అంతేకాదు ఇప్పటివరకు రజత్ పటిదర్ 11 ఇన్నింగ్స్ లో 239 పరుగులు మాత్రమే చేశాడు. అదే వైభవ్ సూర్యవంశీ అనే 14 ఏళ్ల కుర్రాడు మాత్రం... ఆడి ఇన్నింగ్స్ లలో 252 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ పటిదర్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు బెంగళూరు అభిమానులు.
BC is Rajat Patidar Ko Captain Kisne Banaya hai 😭🧐#RCBvsSRH #SHRvsRCB pic.twitter.com/sTikOtfozM
— 𓄂،͜͡𝓢࿐𝐄-𝐇𝐢𝐧𝐝 (@X08T10) May 23, 2025






