కోహ్లీ పరువు తీస్తున్న అభిమాని... ఆ జెర్సీ ధరించి!

by velandi.Saikiran |

విరాట్ కోహ్లీ బెంగళూరుకు సంబంధించిన జెర్సీని ఓ వ్యక్తి ధరించి... చెత్త ఏరుతున్నాడు.

కోహ్లీ పరువు తీస్తున్న అభిమాని... ఆ జెర్సీ ధరించి!
X

దిశ, వెబ్ డెస్క్: విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. అతని కెప్టెన్సీలో వరల్డ్ కప్ రాకపోయినా.. కోహ్లీ మాత్రం చాలా స్పెషల్. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ ఆటగాడి తర్వాత కోహ్లీ ఉంటాడు. ఇక దాదాపు 18 సంవత్సరాలుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కోహ్లీ. ఆర్ సి బి అంటే కోహ్లీ... కోహ్లీ అంటేనే ఆర్సిబి అన్నట్లుగా ప్రస్తుతం హవా కొనసాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో.. కోహ్లీని అవమానించేలా కొంతమంది ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ బెంగళూరుకు సంబంధించిన జెర్సీని ఓ వ్యక్తి ధరించి... చెత్త ఏరుతున్నాడు. ఈ సంఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీడియోను వైరల్ చేసి.. కోహ్లీని నమ్ముకుంటే అభిమానులకు... చెత్త ఏరుకునే పరిస్థితి వస్తుందని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోని చూసిన కోహ్లీ అభిమానులు మాత్రం.. ట్రోలింగ్ చేసే వారికి కౌంటర్ ఇస్తున్నారు. చెత్త ఏరుకునే వారిలో కూడా కోహ్లీకి అభిమానులు ఉంటారని అంటున్నారు. క్లిక్

Next Story