- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరు తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన ఆర్సీబీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవాల్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవాల్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 4న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు ఆర్సీబీ ఇప్పటికే రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. అభిమానుల కోసం ఆర్సీబీ ఇటీవల ఆర్సీబీ కేర్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్సీబీ కేర్స్ ద్వారా మృతుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 25 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ‘జూన్ 4న మన హృదయాలు ముక్కలయ్యాయి. ఆర్సీబీ ఫ్యామిలికి చెందిన 11 మందిని కోల్పోయాం. వారు మనంలో భాగం. వారి జ్ఞాపకాలు మనలో ప్రతి ఒక్కరిలో గుర్తుండిపోతాయి. వారు ఇచ్చిన మద్దతును భర్తీ చేయలేం. అత్యంత గౌరవంతో వారి కుటుంబాలకు రూ.25 లక్షలు అందజేస్తాం. ఇది ఆర్సీబీ కేర్స్‌కు నాంది. ఇది కేవలం ఆర్థికంగానే కాకుండా ఐక్యత, వారి జాగ్రత్తకు వాగ్దానం.’అని ఆర్సీబీ తెలిపింది.






