RCB: ఆర్సీబీకి బంపర్ న్యూస్.. తిరిగి రానున్న ఆసిస్ ఫాస్ట్ బౌలర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-15 08:37:27  IST  )

భారత్‌ (India), పాకిస్తాన్ (Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ఐపీఎల్‌-2025 (ఉఊణ-2025)ను వారం రోజుల వాయిదా వేసిన విషయం తెలిసిందే.

RCB: ఆర్సీబీకి బంపర్ న్యూస్.. తిరిగి రానున్న ఆసిస్ ఫాస్ట్ బౌలర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ (India), పాకిస్తాన్ (Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ఐపీఎల్‌-2025 (ఉఊణ-2025)ను వారం రోజుల వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా జట్లలో ఉన్న విదేశీ ఆటగాళ్లు భద్రత దృష్ట్యా భయంతో తమ సొంత దేశాలకు వెళ్లిపోయారు. అయితే, దాయాది పాక్‌తో కాల్పులు ఒప్పందం జరగడంతో టోర్నీని తిరిగి మే 17 నుంచి పున: ప్రారంభించబోతున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది.

ఈ క్రమంలోనే ఆర్సీబీ జట్టుతో పాటు అభిమానులకు తీపి కబురు అందింది. అకస్మాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయిన ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగి భారత్‌కు రాబోతున్నట్లుగా అతడి సన్నిహిత‌ వర్గాలు తెలిపారు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ (Play Offs) బెర్త్‌ను ఖాయం చేసుకున్న ఆర్సీబీ (RCB) పాయింట్స్ టేబుల్‌లో 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన 11 మ్యాచ్‌లో 8 గెలిచి మూడింట్లో ఓటమి పాలైంది. దీంతో తమ జట్టు ఫస్ట్ టైమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలవాలనే సంకల్పంతో హాజిల్‌వుడ్ తిరిగి ఐపీఎల్ టోర్నీలో పాల్గొనేందుకు భారత్‌కు రానున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం టోర్నీలో 10 మ్యాచ్‌లు అడిన జోష్ ఏకంగా 18 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు.

Next Story