బెంగళూరు తొక్కిసలాట.. మూడు నెలల తర్వాత ఆర్సీబీ ఎమోషనల్ పోస్టు

by Harish |

ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే.

బెంగళూరు తొక్కిసలాట.. మూడు నెలల తర్వాత ఆర్సీబీ ఎమోషనల్ పోస్టు
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆర్సీబీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. మూడు నెలల తర్వాత ఆ ఫ్రాంచైజీ అభిమానులను ఉద్దేశించి ఎక్స్ వేదిక ఓ పోస్టు పెట్టింది. తొక్కిసలాట ఘటనను గుర్తు చేసుకుంటూ విచారం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులు బాధతోనే అభిమానులకు దూరంగా ఉన్నామని తెలిపింది. అలాగే, ఇక నుంచి ఆర్సీబీ కేర్స్ ద్వారా అభిమానులకు అండగా ఉంటామని కీలక ప్రకటన చేసింది.

‘ప్రియమైన 12వ మ్యాన్ ఆర్మీ.. ఇది మీకు మా హృదయపూర్వకమైన లేఖ. మేము పోస్టు పెట్టిన దాదాపు మూడు నెలలు అవుతుంది. ఈ నిశబ్ధం దూరంగా ఉండాలని కాదు. దు:ఖంతోనే ఇలా చేశాం. ఈ వేదిక ఒకప్పుడు ఉత్సాహం, మధుర జ్ఞాపకాలతో, మీరు ఆస్వాదించిన క్షణాలతో నిండిపోయేది. కానీ జూన్ 4వ అంతా మారిపోయింది. ఆ రోజు మన హృదయాలను ముక్కలు చేసింది. అప్పటి నుంచి నిశబ్ధం అలుముకుంది. ఈ సమయంలో మేం ఎంతో ఏడ్చాం. విన్నాం..నేర్చుకున్నాం. అభిమానుల గౌరవించడం కోసం, అండగా ఉండటం కోసం ‘ఆర్సీబీ కేర్స్’ పుట్టింది. మా అభిమానుల కోసం ఈ వేదిక. మీతో ఈ విషయాన్ని పంచుకోవడానికి, అండగా నిలబడటానికి, కలిసి ముందుకు నడవడానికి, కర్ణాటకను గర్వంగా నిలబెట్టేందుకు ఆర్‌సీబీ కేర్స్ పనిచేస్తోంది.’అని ఆర్సీబీ రాసుకొచ్చింది.


Next Story