- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెంచరీ మిస్.. కానీ కపిల్ దేవ్ రికార్డు సమం చేసిన జడ్డూ..!
by Phanindra |
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రవీంద్ర జడేజా త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ కపిల్ దేవ్ రికార్డును మాత్రం సమం చేశాడు.

X
దిశ, స్పోర్ట్స్: టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో 89 పరుగులు చేసిన జడ్డూ.. త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు. సేనా దేశాల్లో ఏడు అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక సార్లు 50+ స్కోర్లు నమోదు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో చేసిన 50+ స్కోరు సేనా దేశాల్లో జడ్డూకు 8వది. అంతకుముందు కపిల్ దేవ్ ఒక్కడే సేనా దేశాల్లో ఏడు, అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 8 సార్లు 50 పరుగుల మార్కు దాటాడు. కాగా, ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్‌తో కలిసి జడ్డూ ఏకంగా 203 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి, జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
Next Story






