- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెంబర్ 1 ఆల్‌రౌండర్‌గా చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా మరో అరుదైన రికార్డును సాధించాడు. గతంలో తన ఆటతీరుతో అన్ని ఫార్మట్లలో ఆల్ రౌండర్‌గా ఉన్న జడ్డు పలు ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటన తర్వాత కూడా తన రికార్డులను కొనసాగిస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా మరో అరుదైన రికార్డును సాధించాడు. గతంలో తన ఆటతీరుతో అన్ని ఫార్మట్లలో ఆల్ రౌండర్ (All-rounder)గా ఉన్న జడ్డు పలు ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటన తర్వాత కూడా తన రికార్డులను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 లో చెన్నై తరుఫున కొనసాగుతున్న జడేజా తాజాగా మరోసారి రికార్డులోకి ఎక్కాడు. టెస్ట్ క్రికెట్ (Test cricket) చరిత్రలో నంబర్ 1 ఆల్‌రౌండర్‌గా అత్యంత పొడవైన పరంపర (స్ట్రీక్) సాధించిన ప్లేయర్ గా జడ్డు నిలిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ (Test all-rounder rankings)లో రవీంద్ర జడేజా 400 రేటింగ్ పాయింట్లతో మళ్లీ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ ర్యాంకింగ్‌తో జడేజా టెస్ట్ క్రికెట్ చరిత్రలో నంబర్ 1 ఆల్‌రౌండర్‌గా అత్యధికంగా 1150 రోజులు కొనసాగాడు. జడేజా ఈ రికార్డును 2025 మే 14 నాటికి సాధించాడు.
ఇది టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ ఆల్‌రౌండర్ (All-rounder) కూడా సాధించని ఘనత నిలిచింది. జడేజా 74 టెస్ట్ మ్యాచ్‌లలో 3,000 పరుగులు మరియు 300 వికెట్ల మైలురాయిని సాధించాడు. భారత్ 2024 T20 వరల్డ్ కప్‌లో విజయం సాధించిన తర్వాత రవీంద్ర జడేజా.. 2024 జూన్ 30న T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. 2025 మార్చి నెలలో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌పై విజయం సాధించిన తర్వాత, జడేజా ODI రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అనేక పుకార్లు వచ్చాయి. కాగా వాటిపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన జడేజా రిటైర్మెంట్ పుకార్లను తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం జడ్డు భారత వన్డే, టెస్ట్ క్రికెట్ జట్టులలో సీనియర్ ఆల్ రౌండర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.






