వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు

by Harish |

వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కనుంది. వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్‌కు ఆయన పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) నిర్ణయించింది. ప్రెస్ బాక్స్‌ కింద ఉన్న లెవల్ 1 స్టాండ్‌కు శాస్త్రి పేరు పెట్టనున్నట్టు వెల్లడించింది. ముంబై, భారత క్రికెట్‌కు ప్లేయర్‌గా, కోచ్‌గా ఆయన ఎంతో చేశారని, ఆ కృషికి ఇది గుర్తింపు అని ఎంసీఏ తెలిపింది. అలాగే, స్టేడియంలోని మూడు గేట్లకు భారత మాజీ క్రికెటర్లు దిలీప్ సర్దేశాయ్, ఏక్‌నాథ్ సోల్కర్, డియానా ఎడుల్జీ పేర్లు పెట్టడానికి ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గేట్ నం.3కి సర్దేశాయ్, గేట్ నం.5కి ఎడుల్జీ, గేట్ నం.6కి సోల్కర్ పేర్లు పెట్టనున్నారు. వాంఖడే స్టేడియంలో సునీల్ గవాస్కర్, రోహిత్ శర్మల పేరిట స్టాండ్స్ ఉన్న విషయం తెలిసిందే.


Next Story