- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోయి మంచి పనే చేసింది !
దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఓడిపోయి మంచి పని చేసిందని బాంబు పేల్చారు రవి శాస్త్రి. ఇకపై తప్పిదాలు సరిచేసుకోని ఆడాలని కోరారు.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ 8 మొదటి మ్యాచ్ లోనే భారత జట్టు ఓడిపోవడంపై రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఓడిపోయి మంచి పని చేసిందని బాంబు పేల్చారు. లేకపోతే ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో టోర్నమెంట్ లో ముందుకు భారత జట్టు వెళ్లి ఉంటే, పెద్ద ప్రమాదమే జరిగేదని హింట్ ఇచ్చారు. సూపర్ 8 మొదటి మ్యాచ్ లోనే భారత జట్టు నెగిటివ్ పాయింట్లు మొత్తం బయటపడ్డాయని వివరించారు. ఇక దక్షిణాఫ్రికా చేతిలో భారత్ జట్టు ఎందుకు ఓడిపోయింది ? ఏ రంగాల్లో భారత జట్టు విఫలమైంది ? ఎక్కడ మెరుగు కావాలి ? కొత్త ప్లేయర్లను తీసుకోవాలా ? లేదా? ఇలా అన్ని అంశాలపై సూర్య కుమార్ యాదవ్ సేన కసరత్తు చేయాలని సూచనలు చేశారు. జట్టును కోచ్ గంభీర్ ముందుండి నడిపించాలని కోరారు.
ఇకపై ఆ తప్పిదాలు చేయొద్దు..రవి శాస్త్రి సూచనలు
ఓటమి నుంచి కచ్చితంగా గుణపాఠం నేర్చుకొని బరిలోకి దిగాలని వెల్లడించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా చేసిన తప్పిదాలు రిపీట్ కాకుండా, తర్వాత మ్యాచ్ లలో భారత్ ఇరగదీయాలని కోరారు. అలా జరిగితే టోర్నమెంట్ లో ఛాంపియన్ గా భారత్ నిలవడం గ్యారెంటీ అని సూచించారు. దీంతో రవి శాస్త్రి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అయితే సూపర్ 8 లో మొదటి మ్యాచ్ ఓడిపోయిన భారత జట్టు, తన తర్వాతి మ్యాచ్ జింబాబ్వే తో రేపు ఆడనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ ఉంటుంది. మార్చి ఒకటో తేదీన వెస్టిండీస్ తో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు జట్లపైన విజయం సాధించాలి. లేకపోతే సెమీఫైనల్ వెళ్లడం కష్టమే అవుతుంది.






