Jasprit Bumrah : బంతి అలా చేయడం చాలా అరుదు.. బుమ్రాపై రవిశాస్త్రి ప్రశంసలు

by Harish |
Jasprit Bumrah : బంతి అలా చేయడం చాలా అరుదు.. బుమ్రాపై రవిశాస్త్రి ప్రశంసలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాపై భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. బుమ్రా చెప్పినట్టు బంతి వింటుందని కితాబిచ్చిన శాస్త్రి.. అతన్ని షేన్ వార్న్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్‌ వంటి దిగ్గజ బౌలర్లతో పోల్చాడు. తాజాగా ఐసీసీ‌తో శాస్త్రి మాట్లాడుతూ.. పొట్టి ప్రపంచకప్‌లో బుమ్రా ప్రదర్శనను ప్రశంసించాడు.

ముఖ్యంగా బంతిపై అతని నియంత్రణను కొనియాడాడు. ‘ప్రపంచానికి ఏం అవసరమో అతను అదే చూపించాడు. కెరీర్‌లో బంతి చెప్పినట్టు వినడం తరుచుగా జరిగేది కాదు. ఇలా చాలా కొంది మాత్రమే చేశారు. నాకు తెలిసి వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షేన్ వార్న్ అలా చేశారు. ఆటలో అగ్రస్థానంలో ఉన్న ప్లేయర్లకు ఆ సామర్థ్యం ఉంటుంది. వరల్డ్ కప్‌లో బుమ్రాకు అది దక్కిందని అనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 8 ఇన్నింగ్స్‌ల్లో 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు.



Next Story

Most Viewed