- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సచిన్, కోహ్లీతో పోలిస్తే.. బుమ్రాపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
సచిన్, కోహ్లీతో పోలిస్తే బుమ్రాకు అంత గుర్తింపు దక్కలేదని అశ్విన్ అన్నాడు. తను జస్సీకి నెంబర్ వన్ ఫ్యాన్ అని చెప్పాడు.

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. అయినా సరే అతనికి సచిన్, కోహ్లీ, రోహిత్‌లకు దక్కినంత గౌరవం దక్కడం లేదని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలోని ప్రతి జట్టూ బుమ్రాను కోరుకుంటుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన అశ్విన్.. ‘నేను తనను ఎంతో మెచ్చుకుంటాను. కానీ మీరు కోరుకునే మాటలు నా నుంచి రావు. బుమ్రా ఒక అద్భుతమైన బౌలర్. నేను ఎవర్నీ మార్కెట్ చేయాలని అనుకోవడం లేదు. బట్.. బుమ్రా మాత్రం అద్భుతమైన క్రికెటర్’ అని స్పష్టంచేశాడు.
అలాగే బుమ్రాకు కూడా సచిన్, కోహ్లీలకు దక్కినంత గౌరవం దక్కాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్.. వీళ్ల కోసం చేసినంత మనం బుమ్రా కోసం చెయ్యం. సాధారణంగా బౌలర్లకు దక్కే దాని కన్నా ఎక్కువ రెస్పెక్ట్ బుమ్రాకు దక్కడం నిజమే. తన ఫ్యాన్ ఫాలోయింగ్ చూడా భారీగానే ఉంది. నేను తన నెంబర్ వన్ ఫ్యాన్. ఈ స్థానం కోసం వాళ్ల వైఫ్‌తో పోటీ ఉందనుకోండి. బట్.. నేనే నంబర్ వన్’ అని అన్నాడు.






