- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యర్ ఏం తప్పు చేశాడు?.. సెలెక్టర్లను నిలదీసిన అశ్విన్
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అయ్యర్‌ను ఆసియా కప్ కోసం సెలెక్ట్ చేయకపోవడంపై అశ్విన్ మండిపడ్డాడు. అతను ఏం తప్పు చేశాడు? అని సెలెక్టర్లను నిలదీశాడు.

దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత జట్టుపై మాజీ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడ్డాడు. ముఖ్యంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్‌ను పక్కన పెట్టడంపై అశ్విన్ అసహనం వ్యక్తంచేశాడు. ‘అయ్యర్‌కు అద్భుతమైన రికార్డుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన అతను.. కనీసం టీంలో లేడు. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని వాదిస్తే.. అయ్యర్ కూడా చక్కని ఫామ్‌లోనే ఉన్నాడు కదా. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరిస్తారు? అసలు అయ్యర్ ఏం తప్పు చేశాడని ఇలా పక్కన పెట్టారు?’ అని సెలెక్టర్లను అశ్విన్ నిలదీశాడు.
ఐపీఎల్‌లో అయ్యర్ ఫామ్‌ను గుర్తుచేసిన అశ్విన్.. ‘కేకేఆర్ తరఫున అద్భుతంగా ఆడి, ఆ జట్టును విజేతగా నిలిపాడు. 2014 తర్వాత పంజాబ్‌ను ఫస్ట్ టైం ఐపీఎల్ ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. తనకున్న షార్ట్ బాల్ సమస్యను అధిగమించాడు. కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లను కూడా ఐపీఎల్‌లో సులభంగా ఎదుర్కొన్నాడు. అయ్యర్, జైస్వాల్ విషయంలో నేను చాలా బాధపడుతున్నా. ఇది నిజంగా చాలా అన్యాయం’ అని స్పష్టంచేశాడు.






