Ranji Trophy : అదరగొట్టిన అభిరత్.. హిమాచల్‌ ప్రదేశ్‌పై హైదరాబాద్ విక్టరీ

by Harish |

రంజీ ట్రోఫీలో హైదరాబాద్ బోణీ కొట్టింది.

Ranji Trophy : అదరగొట్టిన అభిరత్.. హిమాచల్‌ ప్రదేశ్‌పై హైదరాబాద్ విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది. గత రెండు మ్యాచ్‌లను డ్రాతో సరిపెట్టిన హైదరాబాద్.. హిమాచల్‌ప్రదేశ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో హిమాచల్‌ప్రదేశ్ 318 రన్స్ చేయగా.. హైదరాబాద్ 278 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 303 స్కోరు చేసిన హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 40 రన్స్‌ను కలుపుకుని హైదరాబాద్ ముందు 344 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్ అభిరత్ రెడ్డి అదరగొట్టాడు. చివరిరోజైన మంగళవారం భారీ శతకంతో కదం తొక్కి జట్టును గెలిపించాడు. మరో బ్యాటర్ రాహుల్ రాడేశ్(66) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. అభిరత్‌తో కలిసి 145 రన్స్ జోడించిన తర్వాత అవుటయ్యాడు. కానీ, అభిరత్ జట్టుకు అండగా నిలిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు అతను ఏమాత్రం పట్టుదల కోల్పోలేదు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన అతను చివరి వరకూ నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అభిరత్ 200 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. 344 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించిన హైదరాబాద్.. రంజీ ట్రోఫీ చరిత్రలో హయ్యెస్ట్ చేజింగ్ రికార్డుల్లో టాప్-10లో నిలిచింది.


Next Story