IPL 2025: చెన్నైపై రాజస్థాన్ విక్టరీ

by velandi.Saikiran |   (  Updated:2025-05-20 17:38:40  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జరిగిన 62వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది

IPL 2025: చెన్నైపై రాజస్థాన్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జరిగిన 62వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ పై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది రాజస్థాన్ రాయల్స్. బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్... చివరి వరకు పోరాడి విజయం సాధించింది.

ఇందులో గెలిచిన పెద్దగా ఒరిగేదేమీ లేదు కానీ... పాయింట్లు పట్టికలో మెరుగైన స్థానం కోసం... రాజస్థాన్ కాస్త కష్టపడి గెలిచింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని 17.1 ఓవర్స్ లో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది రాజస్థాన్ రాయల్స్. ఎప్పటిలాగే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. యంగ్ స్టార్స్ ఆడడం తప్ప సీనియర్లు ఎవరు కూడా పెద్దగా... రాణించడం లేదు. మహేంద్ర సింగ్ ధోని అయితే అస్సలు.. బ్యాట్ కు పెద్దగా పని చెప్పడం లేదు.

అటు చెన్నై మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆయుష్ ఒక్కడే 43 పరుగులు చేయగా... బ్రేవిస్ 42 పరుగులతో దుమ్ము లేపాడు. చివర లో శివం దూబే 39 పరుగులతో రాణించాడు. మహేంద్ర సింగ్ ధోని చివర లో 16 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక సిక్సర్ కూడా ఉంది. అటు రాజస్థాన్ ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ మరోసారి దుమ్ము లేపాడు. ఈ మ్యాచ్ లో 33 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు 41 పరుగులతో రాణించగా... చివరలో దృవ్ జురెల్ మ్యాచ్ ను గెలిపించేశాడు.

Next Story