- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహ్లీ, ధోని మధ్య చివరి మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఐపీఎల్ 2025 లో భాగంగా రోజు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ (Chennai Super Kings vs Royal Challengers Bangalore) బెంగళూరు జట్ల మధ్య 52వ మ్యాచ్ జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 లో భాగంగా రోజు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ (Chennai Super Kings vs Royal Challengers Bangalore) బెంగళూరు జట్ల మధ్య 52వ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇది 2025తో పాటో ఐపీఎల్‌లో ధోని, కోహ్లీల మధ్య చివరి మ్యాచుగా తెలుస్తుంది. ఎమ్ఎస్ ధోని (MS Dhoni) ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఐపీఎల్ (IPL) ఆడుతున్నాడు. దీంతో ఈ సీజన్ తర్వాత అతను ఐపీఎల్ మ్యాచులకు దూరం అవుతాడని వార్తలు వస్తున్నాయి. అలాగే విరాట్ కోహ్లీ (Virat Kohli) సైతం ఈ సీజన్ లో కప్ కొడితే.. ఐపీఎల్ నుంచి అధికారికంగా చెప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగనుండటంతో క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని మ్యాచ్ చూసేందుకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ షాకింగ్ వార్తను చెప్పింది. గత కొద్ది రోజులుగా బెంగళూరులో సాయంత్రం అయ్యిందంటే చాలు వర్షం (rain) కురుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) సమీపంలో వర్షం కురవడంతో దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ రోజు చెన్నై, ఆర్సీబీ (Chennai, RCB) జట్ల మధ్య జరిగే కీలక మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.
అలాగే ధోని, కోహ్లీ చివరిసారిగా తలపడే మ్యాచ్ ఎలాగైన జరగాలని, ఈ రోజు వర్షం కురవకుండా ఉండాలని ప్రార్ధిస్తున్నారు. మరీ ఈ కీలక మ్యాచ్ జరుగుతుందా.. లేక వర్షం కారణంగా రద్దు అవుతుందా తెలియాలంటే సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే. ఇదిలా ఉంటే బెంగళూరులో ఈ రోజు RCB vs CSK మ్యాచ్‌కు వర్షం కొంత అంతరాయం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, చిన్నస్వామి స్టేడియం అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ (drainage system)ను కలిగి ఉంది. దీని వల్ల పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రి 9 గంటల వరకు వర్షం కురిసినా నిమిషాల వ్యవధిలో మ్యాచుకు గ్రౌండ్ ను సిద్ధం చేయనున్నారు. కనీసం 14 ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






