- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : ఐపీఎల్ ఫైనల్ కు ఆ ముప్పు.. నిరాశలో అభిమానులు
ఐపీఎల్ 2025(IPL 2025) చివరి అంకానికి వచ్చేసింది. ఇక తుది పోరు ఒక్కటే మిగిలి ఉంది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) చివరి అంకానికి వచ్చేసింది. ఇక తుది పోరు ఒక్కటే మిగిలి ఉంది. జూన్ 3న అహ్మదాబాద్(Ahmadabad)లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్(IPL Final Match) జరగనుంది. ఈసారి అయినా 'కప్ నమ్దే సాలా' అనాలని బెంగుళూరు ఎదురు చూస్తుంటే.. ఒక్కసారైనా కప్ కొట్టాలని పంజాబ్ కూడా అంతే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు దాదాపు 1,30,000 మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉండగా.. ఈ పోరుకు వర్షం ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ (IMD) చావు కబురు చల్లగా చెప్పింది.
ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, అహ్మదాబాద్‌లో జూన్ 3 సాయంత్రం నుంచి రాత్రి వరకు వాతావరణం మేఘావృతంగా ఉండి, 60% వర్షం పడే అవకాశం ఉన్నట్లు IMD అంచనా వేసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో గంటకు 10-15 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, దీని వల్ల మ్యాచ్ ఆలస్యం కావచ్చని లేదా ఓవర్లు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ భారీ వర్షం పడితే ఓవర్లు కుదించకుండా జూన్ 4న నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో RCB, రాజత్ పాటిదార్ కెప్టెన్సీలో అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరగా.., PBKS శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆశ్చర్యకరమైన బ్యాటింగ్, బౌలింగ్ కాంబినేషన్‌తో ఫైనల్‌కు దూసుకు వెళ్ళింది. రాజత్ పాటిదార్ ఈ సీజన్‌లో RCBను నడిపిస్తూ 15 మ్యాచ్‌లలో 450 పరుగులు సాధించి, జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించగా.. శ్రేయస్ అయ్యర్ PBKS తరపున 13 మ్యాచ్‌లలో 380 పరుగులతో జట్టును సమర్థవంతంగా నడిపించాడు. వర్షం ముప్పు వార్తను అని తెలుసుకున్న అభిమానులు ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు.






