- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్-అఫ్గాన్ తొలి వన్డేకు వరుణుడి ఆటంకం.. టాస్ ఆలస్యం!
ధర్మశాలలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ ఆలస్యమైంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్-అఫ్గాన్ మధ్య ఇప్పటికే ప్రారంభం కావాల్సిన మొదటి వన్డే (First ODI)కు వర్షం అడ్డంకిగా మారింది. 12 గంటల తర్వాత ఎడతెరిపి లేకుండా ముసురు తో కూడిన వర్షం పడుతుండడంతో టాస్ ఆలస్యం (Delayed toss) అయింది. దీంతో భారత్‌లో పర్యటిస్తున్న అఫ్గానిస్థాన్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ప్రకృతి షాక్ ఇచ్చింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ సమయంలో.. వాతావరణం పూర్తిగా మేఘావృతమై, ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో నిర్ణీత సమయానికి జరగాల్సిన టాస్ (Toss) ఆలస్యమైంది. పిచ్ దెబ్బతినకుండా ఉండేందుకు గ్రౌండ్ స్టాఫ్ పిచ్‌తో పాటు వికెట్ల చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు.
వాతావరణాన్ని పరిశీలిస్తున్న అంపైర్లు - ఓవర్ల తగ్గింపు?
ధర్మశాలలో వాన తీవ్రతను, మైదానంలో నీరు నిలిచిన పరిస్థితులను అంపైర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వర్షం పూర్తిగా తగ్గి, మైదానాన్ని ఆరబెట్టేందుకు సమయం దొరికితే మ్యాచ్‌ను ప్రారంభించాలని చూస్తున్నారు. అయితే, సమయం గడుస్తున్న కొద్దీ ఓవర్ల కోత విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ సాయంత్రానికి వాన మొహం చాటేస్తే, కనీసం సగం మ్యాచ్ (20 ఓవర్ల చొప్పున) అయినా నిర్వహించి ఫలితాన్ని తేల్చాలని అంపైర్లు భావిస్తున్నారు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం రాబోయే కొన్ని గంటల్లో వర్షం తగ్గే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.






