- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Railways vs Delhi : రైల్వేస్ 241పరుగులకు ఆలౌట్..వికెట్ కోల్పోయిన ఢిల్లీ
రంజీ ట్రోఫీ(Ranji Trophy Match) డీ గ్రూప్ చివరి రౌండ్ లో భాగంగా ఢిల్లీ వేదికగా రైల్వేస్ -ఢిల్లీ (Railways vs Delhi)మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రైల్వేస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 241పరుగులకు అలౌట్ అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్: రంజీ ట్రోఫీ(Ranji Trophy Match) డీ గ్రూప్ చివరి రౌండ్ లో భాగంగా ఢిల్లీ వేదికగా రైల్వేస్ -ఢిల్లీ (Railways vs Delhi)మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రైల్వేస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 241పరుగులకు అలౌట్ అయ్యింది. ఓ దశలో 66పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రైల్వేస్ జట్టును ఉపేంద్ర యాదవ్ (95), కరణ్ శర్మ(50), హిమాంశు సంగ్వాన్ (29)లు ఆదుకోవడంతో తేరుకున్న రైల్వేస్ చివరకు 67.4ఓవర్లలో 241పరుగులకు అలౌట్ అయ్యింది. ఆ జట్టులో అంకిత్ యాదవ్(7), వివేక్ సింగ్(0), సూరజ్ అహుజా(14), మహ్మద్ సైఫ్(24), భార్గవ్ మిరాయ్(0), ఆర్యన్ చౌదరి(0), రాహుల్ శర్మ(0), కునాల్ యాదవ్(1 నాటౌట్) పరుగులు సాధించారు. ఢిల్లీ బౌలర్లలో నవదీస్ సైని 3, సుమీత్ మాథూర్ 3 వికెట్లు, సిద్ధాంత్ శర్మ, మనీ గ్రేవాల్ రెండేసి వికెట్ల చొప్పున సాధించి రైల్వే్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు 11పరుగులకే ఓపెనర్ అర్పిత్ రాణా(10) వికెట్ కోల్పోయింది. సనత్ సంగ్వాన్ (9), యశ్ ధూల్(17) పరుగులతో ఆడుతుండగా..ఢిల్లీ జట్టు స్కోర్ ప్రస్తుతం 41/1 వద్ధ కొనసాగుతోంది. రైల్వేస్ బౌలర్ కృనాల్ యాదవ్ ఒక వికెట్ సాధించాడు.
కాగా ఢిల్లీ తరుపునా భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) దాదాపు 13ఏండ్ల తర్వాత దేశవాళీ రంజీ మ్యాచ్ పోటీలో తిరిగి బరిలోకి దిగడంతో..ఆయన ఆట చూసేందుకు అరుణ్ జైట్టీ స్టేడియానికి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
మరోవైపు హర్యానాతో రంజీ మ్యాచ్ లో కర్ణాటక తరుపునా బరిలోకి దిగిన టీమిండియా క్రికెటర్ కేఎల్.రాహుల్ 26పరుగులకే అవుటయ్యాడు. అయితే భారత జట్టులోకి పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మాత్రం (91)పరుగులు సాధించి సెంచరీ చేజార్చుకున్నప్పటికి తన ఫామ్ ను చాటాడు. మరో ఓపెనర్ కేవీ అనీష్ (17) పరుగులకు అవుటవ్వగా, దేవదత్ పడిక్కల్(31), రవీచంద్రన్ శర్మ(18) పరుగులలో ఆడుతున్నారు. కర్ణాటక ప్రస్తుతం 58ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 192పరుగుల వద్ధ ఆట కొనసాగిస్తోంది.
మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా అల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ హ్యాట్రిక్ సాధించాడు. వరుస బంతుల్లో మేఘాలయ బ్యాటర్లు బాలచందర్ అనిరుధ్, సుమిత్ కుమార్, జస్క్రిత్ సింగ్ సచ్ దేవ్ లను డకౌట్ గా పెవిలియన్ పంపాడు. ఈ మ్యాచ్ లో శార్ధూల్ 4వికెట్లు, మోహిత్ అవస్థి 3, డి సౌజా 2, శామ్స్ ములానీ 1 వికెట్ సాధించారు. దీంతో మేఘాలయా 24.3ఓవర్లలోనే 86పరుగులకు కుప్ప కూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ముంబాయి 30ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 87పరుగులతో ఆట కొనసాగిస్తుంది. ముంబాయి ఓపెనర్లు అయూష్ మాత్రే 5, అమోగ్ భత్కాల్ 28 పరుగులకు అవుటయ్యారు. సిద్దేష్ లాడ్ 33, అంజింక్య రహానే 17పరుగులతో ఆడుతున్నారు.






