గంభీర్‌కు కౌంటర్ ఇచ్చిన ద్రవిడ్.. హీరోలు అవసరమంటూ కామెంట్

by Harish |

గంభీర్‌కు కౌంటర్ ఇచ్చిన ద్రవిడ్.. హీరోలు అవసరమంటూ కామెంట్
X

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టులో సూపర్ స్టార్ సంస్కృతికి ముగింపు పలకాలన్నది టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ ఆలోచన. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని గంభీర్ చెప్పాడు కూడా. అయితే, గంభీర్ ఆలోచనతో భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏకీభవించలేదు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ద్రవిడ్ మాట్లాడుతూ.. ప్రతి క్రీడలోనూ హీరోలు అవసరం ఉందన్నాడు. వ్యక్తిగత ప్రశంసలు కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పాడు. ‘ఏ క్రీడకైనా హీరోలు అవసరం ఉంది. ప్రదర్శనలు లేకుండా ఎవరూ హీరోలు కాలేరు. మైదానంలో మీరు రాణించకపోతే ప్రజలెందుకు ఆదరిస్తారు. ముఖ్యంగా భారత్‌లో మీరు చేసే దానిని బట్టి ప్రశంసలు దక్కుతాయి. అదే సమయంలో విమర్శలు కూడా వస్తాయి. మీపై నిరంతర పరిశీలన, ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఒక లెజెండ్ లేదా సూపర్ స్టార్ అవ్వాలంటే అనేక విషయాల్లో నిరూపించుకోవాలి. అలాగే మీ జట్టు గెలవడానికి కూడా సహాయపడాలి.’అని గంభీర్ తెలిపాడు.

‘ఆ ముగ్గురిని భర్తీ చేయడం కష్టం’

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టెస్టుల్లో ఈ ముగ్గురిని భర్తీ చేయడం చాలా కష్టమని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ‘రెడ్ బాల్ క్రికెట్‌లో భారత జట్టు కొన్ని సిరీస్‌ల్లో బాగా ఆడలేదు. ఇది సహజమే. రోహిత్, విరాట్, అశ్విన్ వంటీ కీ ప్లేయర్లు కూడా రిటైర్డ్ అయ్యారు. వారిని భర్తీ చేయడం అంత సులభం కాదు. కానీ భారత క్రికెట్ ఇప్పటికీ బలంగానే ఉంది. ప్రతి ఫార్మాట్‌లో టీమిండియా పోటీ ఇవ్వగలదని నేను నమ్ముతున్నా. దీనికి కాస్త సమయం పట్టవచ్చు. ఈ సీజన్‌లో పరిస్థితులను చక్కదిద్దగలమని ఆశిస్తున్నాం.’అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.


Next Story