- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిల్ బలం అదే.. హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపించిన ద్రవిడ్
టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. తాజాగా మాజీ క్రికెటర్ ఆర్. అశ్విన్ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు. ప్లేయర్లతో రోహిత్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాడని, అదే అతని బలమని చెప్పాడు. అలాగే, జట్టు నుంచి అతనికి ఏం కావాలో అనే దానిపై రోహిత్‌కు స్పష్టత ఉంటుందన్నాడు. ‘రోహిత్‌ను చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. నా చేతుల మీదుగా అరంగేట్రం అవడం నుంచి కెప్టెన్‌గా ఎదగడం చాలా బాగుంది. జట్ల పట్ల అతనికి చాలా శ్రద్ధ ఉంటుంది. జట్టును ఎలా నడిపించాలనుకుంటున్నాడో, తనకు ఏది ముఖ్యమూ తొలి రోజు నుంచే చెప్పాడు. కోచ్‌కు, కెప్టెన్‌కు మధ్య సంబంధంలో ఇది చాలా ముఖ్యమైంది. నేనెప్పుడు కెప్టెన్ జట్టుగా ఉండాలని నమ్ముతా. నేను ప్లేయర్‌గా ఆడాను. కెప్టెన్‌గా చేశాను. కెప్టెన్ తాను వెళ్లాలనుకునే దిశలో జట్టును నడిపించాలి. దానికి కోచ్‌గా సహాయం చేయాలి. జట్టు నుంచి ఏం కావాలో, జట్టు వాతావరణం ఎలా ఉండాలో అనే విషయాలపై రోహిత్‌కు క్లారిటీ ఉంది. అది అతనికి అనుభవం వల్ల వచ్చి ఉండొచ్చు. అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. జట్టుతో బాగా కనెక్ట్ అయ్యాడు. రోహిత్ కంఫర్ట్‌గా ఉంటే అతను ఆడటమే కాదు ప్రతి ఒక్కరిని ఆడేలా చేస్తాడు.’అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. 2022-24 మధ్య ద్రవిడ్, రోహిత్‌లు కోచ్-కెప్టెన్‌గా భారత జట్టుకు అద్భుత విజయాలు అందించారు. 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక గతేడాది టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచి 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణ తెరదించింది. ఆ ప్రపంచకప్ విజయంతోనే ద్రవిడ్ పదవీకాలం ముగియగా.. రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.






