- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆచితూచి ఆడుతున్న రాహుల్, నాయర్.. భారీ అధిక్యం దిశగా భారత్
ఎడ్జ్‌బాస్టన్ (Edgebaston) వేదికగా ఇంగ్లాండ్ (England)తో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో టీమిండియా (Team India) భారీ అధిక్యం దిశగా వెళ్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఎడ్జ్‌బాస్టన్ (Edgebaston) వేదికగా ఇంగ్లాండ్ (England)తో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో టీమిండియా (Team India) భారీ అధిక్యం దిశగా వెళ్తోంది. 1 వికెట్ నష్టానికి 64 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ వికెట్లు ఏమీ కోల్పోకుండా మరో 22 పరుగులు చేసి 84 పరుగుల వద్ద ఆట కొనసాగుతోంది. కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 39 పరుగులు, కరుణ్ నాయర్ 40 బంతుల్లో 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియాకు రెండు ఇన్సింగ్స్‌లో 264 పరుగుల అధిక్యం లభించింది.
కాగా, 77/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్ (207 బంతుల్లో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్ (234 బంతుల్లో 158 పరుగులు) భారీ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం ఆ ఇద్దరే 6వ వికెట్‌కు ఏకంగా 303 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు, ఆకాశ్ దీప్ 4 వికెట్లను నేలకూర్చారు.






