రహ్మానుల్లా గుర్బాజ్ ఇంట తీవ్ర విషాదం

by velandi.Saikiran |

ఆఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఇంట‌ తీవ్ర విషాదం నెలకొంది. గుర్బాజ్ తల్లి కన్నుమూశారు.

రహ్మానుల్లా గుర్బాజ్ ఇంట తీవ్ర విషాదం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఇంట‌ తీవ్ర విషాదం నెలకొంది. గుర్బాజ్ తల్లి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గుర్బాజ్ తల్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. కాబూల్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆమె మరణించారని సమాచారం. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గుర్బాజ్ తల్లి మృతి చెందిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు.

రహ్మానుల్లా గుర్బాజ్ కెరీర్

రహ్మానుల్లా గుర్బాజ్..ఆఫ్ఘనిస్తాన్ జట్టులో వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు. ఓపెనింగ్ కూడా చేస్తాడు. 2019లో జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా అరంగేట్రం చేసిన రహ్మానుల్లా గుర్బాజ్, వన్డేల్లో 2021లో అంతర్జాతీయ మ్యాచ్ ఐర్లాండ్ పై ఆడాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో కేకేఆర్ జట్టు తరఫున రహ్మానుల్లా గుర్బాజ్ ఆడిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాలన్నది అతని డ్రీమ్.

Next Story