- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్ చేతిలో ఓడితే, మా ఫ్యాన్స్ సూసైడ్ చేసుకుంటారు !
పాకిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారని రహ్మానుల్లా గుర్బాజ్ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. ఓ యుద్ధం తరహాలోనే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కూడా అంతర్జాతీయంగా పాపులారిటీ దక్కించుకుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో రెండు జట్లు కూడా చాలా కసిగా ఆడుతున్నాయి. అయితే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లపై తాజాగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రహ్మానుల్లాహ్ గుర్బాజ్ (Rahmanullah Gurbaz) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటారు - గుర్బాజ్
పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైతే తమ దేశంలో కొంత మంది అభిమానులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఏ మాత్రం వెనకాడబోరని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఆసియా కప్ 2022 సమయంలో పాకిస్తాన్ చేతిలో తమ జట్టు ఓడిపోయిందని గుర్తు చేస్తూ.. ఈ విషయాలను పంచుకున్నారు రహ్మానుల్లాహ్ గుర్బాజ్. ఆ సమయంలో తమ క్రికెటర్లు కన్నీళ్లు పెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు. అప్పటి ఓటమి తలుచుకుంటే ఇప్పటికి కూడా ఏడుపు వస్తుందని వివరించారు. బౌలింగ్ లో అద్భుతంగా రాణించాం కానీ, బ్యాటింగ్ లో విఫలమైనట్లు తెలిపారు. అందుకే ఈ మ్యాచ్ లో ఓడిపోయినట్లు రహ్మానుల్లాహ్ గుర్బాజ్ వివరించారు. అయితే ఈ ఓటమి నేపథ్యంలో కొంతమంది తమ దేశ అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారని షాకింగ్ నిజాలు బయట పెట్టారు.






