శ్రేయస్ అయ్యార్ వలనే రహానేకు WTC ఫైనల్‌‌లో చోటు..!

by Disha Web Desk 12 |
శ్రేయస్ అయ్యార్ వలనే రహానేకు WTC ఫైనల్‌‌లో చోటు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటివల ప్రకటించిన WTC ఫైనల్‌‌కు భారత్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఐపీఎల్ లో బ్యాటింగ్‌తో అదరగొడుతున్న భారత టెస్ట్ మాజీ కెప్టెన్ అజింక్యా రహానెకు అనూహ్యంగా చోటు దక్కింది. అయితే మరికొందరు మాత్రం రహానేకు ఫైనల్ టీమ్ లో చోటు దక్కడంపై వివిధ కారణాలు చెబుతున్నారు. అందులో భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఉన్నాడు. ఈయన శ్రేయస్ అయ్యర్ కారణంగానే రహానేకు చాన్స్ వచ్చిందని.. శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉంటే అతనికే చాన్స్ ఉండేదని.. ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అలాగే.. "విదేశీ పిచ్‌లపై రహానే ప్రదర్శన ఎప్పుడూ బాగానే ఉంది. ఇది అతనికి అనుకూలంగా ఉంది" అని ఇర్ఫాన్ జోడించాడు. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ WTC ఫైనల్‌కు దూరమయ్యాడు.

Next Story

Most Viewed