విజయంతో నదాల్ పునరాగమనం

by Dishanational3 |
విజయంతో నదాల్ పునరాగమనం
X

దిశ, స్పోర్ట్స్ : గాయం కారణంగా జనవరి నుంచి ఆటకు దూరమైన స్పెయిన్ టెన్నిస్ స్టార్, 22 గ్రాండ్‌స్లామ్ విజేత రాఫెల్ నదాల్ విజయంతో పునరాగమనం చేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న బార్సిలోనా ఓపెన్ టోర్నీలో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో నదాల్ 6-2, 6-3 తేడాతో ఇటలీ ప్లేయర్ ఫ్లావియో కోబోలిని ఓడించాడు. 2022లో ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత తొలిసారిగా మట్టి కోర్టులో ఆడుతున్న నదాల్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. గంటా 25 నిమిషాల్లో రెండు సెట్లను గెలుచుకుని ప్రత్యర్థి ఆట ముగించాడు. నాలుగు సార్లు ఇటలీ ప్లేయర్ సర్వీస్‌లను బ్రేక్ చేశాడు. రెండో రౌండ్‌లో 4వ సీడ్, ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ డి మినార్‌ను నదాల్ ఎదుర్కోనున్నాడు.


Next Story

Most Viewed