ప‌లాష్‌-స్మృతి పెళ్లి వాయిదా...రాధా యాద‌వ్ షాకింగ్ నిర్ణ‌యం

by velandi.Saikiran |

ప‌లాష్‌-స్మృతి పెళ్లి వాయిదా...రాధా యాద‌వ్ షాకింగ్ నిర్ణ‌యం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: స్మృతి మందాన-పలాష్ ముచ్చల్ వివాహం అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం వీళ్ల‌ వివాహం జరగాల్సి ఉంది. కానీ స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు రావడంతో పెళ్లిని వాయిదా వేశారు. ఇక నిన్న ప‌లాష్ ముచ్చ‌ల్‌ కూడా వైరల్ ఫీవర్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడట. ఇలాంటి నేపథ్యంలో స్మృతి మందాన పెళ్లి వాయిదా పడడంపై మరో న్యూస్ కూడా బయటకు వచ్చింది. వేరే అమ్మాయితో పలాష్‌ ముచ్చల్ రిలేషన్ పెట్టుకున్నాడని, ఈ వ్యవహారం బయటపడడంతోనే పెళ్లి వాయిదా పడిందని ప్రచారం చేస్తున్నారు.

ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రావ‌డంతో పెళ్లి ఆపే మార్గం లేక స్మృతి మందాన తండ్రి గుండెపోటు అంటూ కొత్త నాటకానికి తెరలేపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో స్మృతి మందాన డిలీట్ చేశారు. ఇక లేటెస్ట్ గా స్మృతి మందాన క్లోజ్ ఫ్రెండ్ అయిన రాధా యాదవ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప‌లాష్ ముచ్చ‌ల్ ను సోషల్ మీడియా వేదికగా అన్ ఫాలో చేశారు. అతడు పెద్ద చీటర్ అనే మీనింగ్ వచ్చేలా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story