గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. రబాడాపై నిషేధం.. ఎందుకో తెలుసా?

by Harish |

సౌతాఫ్రికా, గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడా డ్రగ్ టెస్టులో విఫలమయ్యాడు.

గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. రబాడాపై నిషేధం.. ఎందుకో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా, గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడా డ్రగ్ టెస్టులో విఫలమయ్యాడు. దీంతో అతనిపై నిషేధం పడింది. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో రబాడా ఎంఐ కేప్‌టౌన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో అతను వినోదం కోసం నిషేధత డ్రగ్‌ను తీసుకున్నాడు. దీంతో అతను తాత్కాలికంగా సస్పెండ్ అయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, రబాడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ మేరకు శనివారం సౌతాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ రిలీజ్ చేసిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించాడు.

తాను తప్పు చేశానని, అందుకు క్షమించాలని కోరాడు. ‘అందరూ క్షమించండి. ఆటపై అధికారాన్ని నేనెప్పుడు తీసుకోను. నా కంటే, నా ఆకాంక్షల కంటే ఆ హక్కు చాలా పెద్దది. నేను తాత్కాలికంగా సస్పెన్షన్‌కు గురయ్యాను. రిక్రియేషనల్ డ్రగ్ తీసుకోవడం వల్ల ఇది జరిగింది. అయితే, ఈ చర్య నన్ను నిర్వచించదు. నేనెప్పుడు చేసేదాన్నే చేస్తుంటా. నా ఆటపై నిబద్ధతతో ఉంటా. కష్టపడుతూనే ఉంటా.’అని రబాడా తెలిపాడు. ఐపీఎల్-18లో రబాడా గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, ఇటీవల అతను ముఖ్యమైన వ్యక్తిగత కారణాల వల్ల సౌతాఫ్రికాకు తిరిగి వెళ్లినట్టు ఫ్రాంచైజీ తెలిపింది. తాజాగా నిషేధం కారణంగా అతను తిరిగి ఐపీఎల్‌కు వచ్చే అవకాశం లేదు. అయితే, రబాడాపై ఎంత కాలం నిషేధం విధించారనే దానిపై స్పష్టత లేదు.


Next Story