- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదిత్ గుజరాతిపై ప్రజ్ఞానంద గెలుపు
by Harish |
ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో మూడు రౌండ్‌ల తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద విజయం పొందాడు.

X
దిశ, స్పోర్ట్స్ : చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో మూడు రౌండ్‌ల తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద విజయం పొందాడు. ఐదో రౌండ్‌లో సహచరుడు విదిత్ సంతోష్ గుజరాతిపై గెలుపొందాడు. 52 ఎత్తుల్లో ప్రజ్ఞానంద పైచేయి సాధించాడు. గత మూడు రౌండ్లలో ప్రజ్ఞానంద ప్రజ్ఞానంద రెండు ఓటములు, ఒక డ్రాను పొందాడు. మరో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ టోర్నీలో తొలి పరాజయాన్ని చవిచూశాడు. ఐదో రౌండ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన డేవిడ్ నవారా చేతిలో ఓడిపోయాడు. పోరాడిన గుకేశ్ 61 ఎత్తుల్లో గేమ్‌ను కోల్పోయాడు. ఐదు రౌండ్లు ముగిసే సరికి గుకేశ్, ప్రజ్ఞానంద చెరో 2.5 పాయింట్లతో 4వ స్థానాన్ని పంచుకోగా.. విదిత్ గుజరాత్(2.0) 9వ స్థానంలో ఉన్నాడు. ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ అబ్దుసత్తరోవ్(4.0) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Next Story






