- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుమ్రా కంటే వారిద్దరే ప్రమాదకరం : అశ్విన్
టీ20ల్లో ప్రత్యర్థి జట్లకు బుమ్రా కంటే భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, యువ బ్యాటర్ అభిషేక్ శర్మలు మరింత ప్రమాదకరమని భారత మాజీ క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

దిశ, స్పోర్ట్స్ : టీ20ల్లో ప్రత్యర్థి జట్లకు బుమ్రా కంటే భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, యువ బ్యాటర్ అభిషేక్ శర్మలు మరింత ప్రమాదకరమని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది భారత్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి జట్లకు వరుణ్, అభిషేక్‌లను నుంచి ప్రమాదం పొంచి ఉందన్నాడు. ‘భారత్‌లో జరగబోయే టీ20 కప్‌ను ఏ జట్టైనా గెలవాలనుకుంటే వారు ప్రధానంగా రెండు అడ్డంకులను అధిగమించాలి. ఇప్పటివరకు బుమ్రా గురించే చెబుతా వచ్చాను. కానీ, అతడి కన్నా వరుణ్ చక్రవర్తి, అభిషేక్ ప్రమాదకరం. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో వరుణ్‌ను టిమ్ డేవిడ్ ఎదుర్కొన్న విధానం చూసిన తర్వాత నా అభిప్రాయం మరింత బలపడింది. వరుణ్, అభిషేక్‌ను హ్యాండిల్ చేస్తే ప్రత్యర్థి జట్లు విజయం సాధించగలవు.’అని అశ్విన్ తెలిపాడు.






