చివరలో సిరాజ్ 3 సిక్స్ లు కొట్టాల్సింది.. టీమిండియా ప్లేయర్ సంచలనం !

by velandi.Saikiran |

లార్డ్స్ వేదికగా (lORDS) టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండు రోజుల కిందట మూడో టెస్ట్ మ్యాచ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ

చివరలో సిరాజ్ 3 సిక్స్ లు కొట్టాల్సింది.. టీమిండియా ప్లేయర్ సంచలనం !
X

దిశ, వెబ్ డెస్క్: లార్డ్స్ వేదికగా (lORDS) టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండు రోజుల కిందట మూడో టెస్ట్ మ్యాచ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కేవలం 22 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. చివరి వరకు రవీంద్ర జడేజా (RAVINDRA JADEJA) అలాగే మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj ) ఇద్దరు పోరాడారు. కానీ చివరలో... మహమ్మద్ సిరాజ్ వికెట్ పడిపోవడంతో మ్యాచ్ ఓడిపోయింది టీమిండియా. అయితే ఈ ఎపిసోడ్ పై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin ).. కీలక వ్యాఖ్యలు చేశారు.

సిరాజ్ మూడు సిక్సులు కొట్టి గెలిపిస్తాడని నమ్మకాన్ని తన తండ్రి... లార్డ్స్ టెస్ట్ సందర్భంగా పేర్కొన్నట్లు అశ్విన్ తాజాగా వెల్లడించారు. కానీ దురదృష్టవశాత్తు సిరాజ్ అవుట్ అయ్యాడని వెల్లడించారు. బెన్ స్టోక్స్ కూడా అద్భుతమైన బంతులు వేశాడని అశ్విని ఈ సందర్భంగా అశ్విన్ తెలిపారు. ఒక స్పెల్ లో 9.2 ఓవర్లు వేశాడని గుర్తు చేశారు. మరో దాంట్లో 10 ఓవర్లు వేశాడని కొనియాడారు. అలా దాదాపు 135 నుంచి 140 స్పీడ్ తో బంతులు సంధించాడని కొనియాడారు. అతని పోరాటం వల్ల ఇంగ్లాండ్ గెలిచిందని వెల్లడించారు.

Next Story