- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌కు షాక్.. ఆ టోర్నీ నుంచి తప్పుకున్న సింధు
బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్‌డ్ చాంపియన్‌షిప్‌కు ముందు భారత్‌కు గట్టి షాక్ తగిలింది.

దిశ, స్పోర్ట్స్ : బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్‌డ్ చాంపియన్‌షిప్‌కు ముందు భారత్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ షట్లర్ పీవీ సింధు గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. ఇటీవల ఈ టోర్నీకి 14 మందితో కూడిన భారత బృందాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన ప్లేయర్లు గువహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో శిక్షణ పొందుతున్నారు. ట్రైనింగ్‌లో సింధు తొడకండరాల గాయానికి గురైంది. స్కానింగ్‌లో కోలుకోవడానికి ఊహించినదాని కంటే ఎక్కువ సమయం పడుతుందని తేలింది. దీంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సింధు ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆమె స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. చైనాలో మంగళవారం నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. ఈ నెల 12న తొలి మ్యాచ్‌లో మకావుతో భారత్ తలపడనుంది. 2023లో జరిగిన చివరి ఎడిషన్‌లో భారత్ కాంస్యం నెగ్గింది. ఈ సారి స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్న జట్టుకు సింధు దూరమవడం భారీ ఎదురుదెబ్బే.
- Tags
- #PV Sindhu






