భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు గాయం.. BWF టూర్ ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

by Malleboina Mahesh |

గాయం కారణంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాదిలో మిగిలిన అన్ని BWF టూర్ ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు గాయం.. BWF టూర్ ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu)కు తీవ్ర గాయం అయింది. దీంతో ఆమె ఈ ఏడాదిలో మిగిలిన అన్ని BWF టూర్ ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన బృందం, ప్రముఖ వైద్యులు డా. పర్డివాలా సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో వెల్లడించారు. యూరోపియన్ సిరీస్ ప్రారంభానికి ముందు తనకు అయిన పాద గాయం నుంచి తాను పూర్తిగా కోలుకోలేదని, అందువల్లే రాబోయే పోటీల్లో పాల్గొనడం సరికాదని తన వైద్యుడు తెలిపినట్లు ఆమె స్పష్టం చేసింది. గాయాలు క్రీడాకారుల ప్రయాణంలో భాగమని, అవి కష్టమైనప్పటికీ తిరిగి బలంగా ఎదగడానికి ప్రేరణగా నిలుస్తాయని సింధు తన నోట్‌లో పేర్కొంది.

తన రికవరీ, ట్రైనింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, వైద్యులు డా. వేన్ లాంబార్డ్ Dr. Wayne Lombard() పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని సింధు తెలిపారు. అలాగే నిషా రావత్‌, చేత్నా, కోచ్ ఇర్వాన్ష్యా, తన బృందం ఇచ్చే మద్దతుతో ప్రతి రోజు కొత్త ఉత్సాహాన్ని పొందుతున్నానని పేర్కొన్నారు. అభిమానుల ప్రేమ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలుపుతూ, త్వరలోనే తిరిగి కోర్ట్‌లోకి వస్తానని తెలిపారు. “ది జర్నీ కంటిన్యూస్ సూన్” అంటూ తన పీవీ సింధు తన సందేశాన్ని ముగించారు.

Next Story