- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగపూర్ ఓపెన్‌లో సింధు శుభారంభం
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది.

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సింధు 21-14, 21-9 తేడాతో కెనడాకు చెందిన్ వెన్ యు జాంగ్‌పై విజయం సాధించింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన సింధు రెండు గేముల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుని ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. అక్కడ చైనా క్రీడాకారిణి చెన్ యు ఫీతో తలపడనుంది. మహిళల సింగిల్స్‌లో తొలి రోజు సింధు మినహా మిగతా వారు నిరాశపరిచారు. అన్మోల్ ఖర్బ్, మాళవిక బాన్సోద్, రక్షితశ్రీ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలయ్యారు. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ హెచ్.ఎస్ ప్రణయ్ ముందంజ వేశాడు. రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో ప్రణయ్ 19-21, 21-16, 21-14 తేడాతో రాస్మస్ జెమ్కె(డెన్మార్క్)పై గెలుపొందాడు. తొలి గేమ్ కోల్పోయి మొదట వెనుకబడిన ప్రణయ్ ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు గేముల్లో నెగ్గాడు. యువ షట్లర్లు కిరణ జార్జ్, ప్రియాన్ష్ రజావత్ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారిపట్టారు.






