IPL 2025 : భారీ స్కోర్ చేసిన పంజాబ్... చెన్నై టార్గెట్ 220

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్(PBKS vs CSK) మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

IPL 2025 : భారీ స్కోర్ చేసిన పంజాబ్... చెన్నై టార్గెట్ 220
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్(PBKS vs CSK) మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ పరుగుల వరద పారించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్ ప్రియాంష్ ఆర్య(Priyamsh Arya) 103 పరుగులు చేసి వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. 42 బాల్స్ లో 7 ఫోర్లు, 9 సిక్సులతో ఫాస్టెస్ట్ సెంచరీ(Fastest Century) నమోదు చేశాడు. ఆర్యతో పాటు శశాంక్ 52, మార్కో 34 పరుగులు వేగంగా రాబట్టారు. దీంతో పంజాబ్ కింగ్స్ స్కోర్ బోర్డ్ సునాయాసంగా 200 దాటింది. చెన్నై బౌలర్స్ లో ఖలీల్ అహ్మద్ 2, అశ్విన్ 2, ముకేష్ చౌదరి, నూర్ మహ్మద్ తలా ఒక వికెట్ తీశారు. 220 పరుగుల భారీ లక్ష్యంతో సీఎస్కే బరిలోకి దిగనుంది.

Next Story