IPL 2025: లీగ్ చివరి మ్యాచ్‌లో ఘన విజయం.. అగ్రస్థానానికి పంజాబ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-26 18:35:53  IST  )

లీగ్ చివరి మ్యాచ్‌లో పంజాబ్ ఘన విజయం సాధించింది.

IPL 2025: లీగ్ చివరి మ్యాచ్‌లో ఘన విజయం.. అగ్రస్థానానికి పంజాబ్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ -2025(IPL 2025)లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ ఘన విజయం సాధించింది. లీగ్ చివరి మ్యాచ్‌(Last match league )లో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 రన్స్ చేసింది. అయితే పంజాబ్ 18.3 ఓవర్లలోనే ఈ టార్గెట్‌ను ఛేదించింది. మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ముంబై బౌలర్లపై పంజాబ్ బ్యాట్స్ మెన్ ప్రియాంశ్ ఆర్య విరుచుపడ్డారు. 35 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్‌లో 62 పరుగులు చేశారు. మరో బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 రన్స్ చేశారు. శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేయగా ప్రభ్ సిమ్రన్ సింగ్ 13 పరుగులు చేశారు. దీంతో 7 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపొందింది. ఇక ముంబై బౌలర్లలో శాంట్నర్ 2, జస్ ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీశారు.

అంతకుముందు ముంబై ఇండియన్స్ టాస్ ఓడి బ్యాంటింగ్‌కు దిగింది. సూర్య కుమార్ యాదవ్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో మొత్తం 57 రన్స్ సాధించారు. రికెల్ టన్ 27 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 24 రన్స్ చేయగా హార్దిక ప్యాండ్ల 26, నవన్ ధీర్ 20, విల్ జాక్స్ 17, తిలక్ వర్మ ఒక్క రన్ చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దిప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, మార్కో యాన్సెస్ రెండేసి వికెట్లు తీశారు. హర్ ప్రీత్ బ్రార్ ఓ వికెట్ పడగొట్టారు. దీంతో ముంబై స్కోర్ 7 వికెట్లు కోల్పోయి 184 స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఐపీఎల్‌లో చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ఈ గెలుపుతో క్వాలిఫయర్-1లో ఆడేందుకు పంజాబ్ అర్హత సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

Next Story