పంజాబ్ గ్రాండ్ విక్టరీ... ఇంటికి ధోని సేన !

by velandi.Saikiran |   (  Updated:2025-04-30 18:07:02  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) _ భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings

పంజాబ్ గ్రాండ్ విక్టరీ... ఇంటికి ధోని సేన !
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) _ భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings ) గ్రాండ్ విక్టరీ కొట్టింది. అందరూ ముందుగా అంచనా వేసినట్టే... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( CSK) మరో ఓటమిని మూటగట్టుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఏకంగా పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు... 19.2 ఓవర్లలో 190 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... ఆచితూచి ఆడింది పంజాబ్ కింగ్స్. ఈ నేపథ్యంలోనే 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించింది పంజాబ్ కింగ్స్. దీంతో నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

రఫ్ఫాడించిన శ్రేయస్ అయ్యర్, ప్రభు సిమ్రాన్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై.. చేజింగ్ చేసే క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ సిమ్రాన్, ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడారు. శ్రేయస్ అయ్యర్ 72 పరుగులు చేయగా, ప్రభ సిమ్రాన్ 54 పరుగులతో దుమ్ము లేపాడు. ఈ ఇద్దరు చివరి వరకు మ్యాచ్ తీసుకువెళ్లారు. ఏ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా... రఫ్ ఆడించారు. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లు చివరలో ఔట్ కావడంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కాస్త స్ట్రగుల్ అయ్యారు. మహేంద్ర సింగ్ ధోని ఎత్తుగడలకు కాస్త వణికిపోయారు. అయినప్పటికీ చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండటంతో.. పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( CSK) ప్లే ఆఫ్స్ ఆశలను దూరం చేసుకుంది.

Next Story