- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు క్వాలిఫైయర్ 2 మ్యాచ్..జట్ల వివరాలు ఇవే
ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇవాళ రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ రెండవ

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇవాళ రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ రెండవ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) అలాగే పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) తలపడతాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium) వేదికగా జరుగుతుంది. ఇక సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో... టాస్ గెలిచిన జట్టుకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది.
ఇవాల్టి కండిషన్స్ బట్టి బ్యాటింగ్ తీసుకోవాలా? లేదా బౌలింగ్ తీసుకోవాలా? అనేది డిసైడ్ కావచ్చు. ఇక ఈ మ్యాచ్ నేపథ్యంలో పంజాబ్ ఆటగాడు చాహల్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. అటు ముంబై ఇండియన్స్ కూడా చాలా బలంగా... కనిపిస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో చివరి క్షణంలో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది ముంబై ఇండియన్స్.
జట్ల అంచనా
ముంబై ఇండియన్స్ (MI) : జానీ బెయిర్‌స్టో (WK), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (C), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్






