- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ ఢిల్లీతో పంజాబ్ మ్యాచ్..అయ్యర్ బిగ్ ప్లాన్ !
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా... ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. జైపూర్ లోని అంతర్జాతీయ క్రికెట్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా... ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. జైపూర్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్( Punjab) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi capitals) మధ్య 66వ మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్... పంజాబ్ జట్టుకు చాలా కీలకం. ఇవాల్టి మ్యాచ్ లో విజయం సాధిస్తే... పాయింట్లు పట్టికలో మొదటి స్థానానికి పంజాబ్ కింగ్స్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టుకు.. అడ్వాంటేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
సెమిస్ లో ఓడిపోయిన కూడా... మరో అవకాశం ఉంటుంది. అందుకే మొదటి స్థానం కోసం అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. సరిగా ఫామ్ లో లేని.. ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి... మొదటి స్థానానికి వెళ్లాలని పంజాబ్ ప్లాన్ చేస్తుంది. దీనికి తగ్గట్టుగానే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో.. పంజాబ్ ప్లేయర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. మరి ఇవాల్టి మ్యాచ్ లో ఢిల్లీ పై ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.
జట్ల వివరాలు ఇవే
పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (C), జోష్ ఇంగ్లిస్ (WK), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, శశాంక్ సింగ్, మార్కో జాన్‌సెన్, హర్‌ప్రీత్ బ్రార్/విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ చాహల్.
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (WK), సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్ (c)/మాధవ్ తివారీ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్.






