క్వాలిఫైయర్ 2లో చెలరేగిన ముంబై.. పంజాబ్ టార్గెట్ 204 రన్స్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-01 18:38:18  IST  )

ఐపీఎల్ 18వ సీజన్ లో ఫైనల్స్ లో ఆర్సీబీతో తలపడే జట్టు ఏదో మరికొద్దిసేపటిలో తేలనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పంజాబ్.

క్వాలిఫైయర్ 2లో చెలరేగిన ముంబై.. పంజాబ్ టార్గెట్ 204 రన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 18వ సీజన్ లో ఫైనల్స్ లో ఆర్సీబీతో తలపడే జట్టు ఏదో మరికొద్దిసేపటిలో తేలనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పంజాబ్. బరిలోకి దిగిన ముంబై బ్యాటర్ తమ సత్తా చూపించారు. తొలుత వర్షం కారణంగా మ్యాచ్ కు బ్రేక్ పడినట్లేనని భావించినా.. ఆ తర్వాత వరుణుడు కరుణించడంతో మ్యాచ్ ప్రారంభమయింది. 9.45 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవ్వగా.. మూడో ఓవర్ లో రోహిత్ శర్మ భారీ షాట్ కొట్టబోయి విజయ్ కుమార్ కు క్యాచ్ ఇచ్చి 8 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన తిలక్ వర్మ.. జానీ బెయిర్ స్టో భాగస్వామ్యంతో 70 పరుగులు చేశారు. ఏడో ఓవర్లో బెయిర్ స్టో 38 పరుగులకు ఔటవ్వగా సూర్యకుమార్ యాదవ్ గ్రౌండ్ లోకి వచ్చాడు.

14వ ఓవర్ లో సూర్యకుమార్ యాదవ్ (44), 15వ ఓవర్లో తిలక్ వర్మ (44) ఔటవ్వగా.. హార్టిక్ పాండ్యా, నమన్ ధీర్ బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి పంజాబ్ బౌలర్లకు నమన్ ధీర్ చుక్కలు చూపించాడు. అర్షదీప్ వేసిన 17వ ఓవర్లో నమన్ ఏకంగా 3 ఫోర్లు బాది.. 14 పరుగులు చేశాడు. 18వ ఓవర్లో 10 రన్స్ చేసినా.. హార్దిక్ ఓటయ్యాడు. 19వ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదిన నమన్.. 20వ ఓవర్లో ఔటయ్యాడు. మొత్తం 18 బంతుల్లో ఏడు ఫోర్లు బాది 37 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగా.. పంజాబ్ టార్గెట్ 204గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవ్వగా.. పంజాబ్ నుంచి ఓపెనర్లుగా ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య వచ్చారు. ఈ మ్యాచ్ లో పంజాబ్ విన్ అయి ఫైనల్ కు వెళ్తే .. ఆర్సీబీ , పంజాబ్ లో ఎవరు కప్ గెలిచినా అది వారికి తొలి విజయం కానుంది.

Next Story