IPL 2025: టాస్ గెలిచిన పంజాబ్.. ఓవర్లు కుదింపు !

by velandi.Saikiran |   (  Updated:2025-04-18 16:25:27  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ పంజాబ్

IPL 2025: టాస్ గెలిచిన పంజాబ్.. ఓవర్లు కుదింపు !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( PBKS) మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారడంతో... టాస్ ప్రక్రియ ఆలస్యమైంది. ఇటు మ్యాచ్ కూడా... మరింత ఆలస్యం అయింది. భారీ వర్షం కారణంగా.... ఈ మ్యాచ్ ను 14 ఓవర్లకు కుదించారు.

అంటే రెండు జట్లు మొత్తం 28 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. వర్షం తగ్గడంతో.... కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఈ తరుణంలో టాస్ గెలిచిన... పంజాబ్ కింగ్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేయబోతుంది. అయితే మ్యాచ్ 14 ఓవర్లకు కుదించడంతో... జట్టులోని నలుగురు బౌలర్లు మూడు ఓవర్ల చొప్పున 12 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. మరొక బౌలర్ రెండు ఓవర్లు వేస్తే సరిపోతుంది. పవర్ ప్లే కూడా కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే ఉంటుంది.

Next Story