- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడో టెస్టుకు పుజారా సెలెక్ట్ చేసిన భారత జట్టు ఇదే.. ఆ సీనియర్ ప్లేయర్‌కు షాక్
బ్రిస్బేన్ టెస్టులో బరిలోకి దిగే భారత తుది జట్టును పుజారా అంచనా వేశాడు.

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు భారత తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వాష్టింగన్ సుందర్‌ను తీసుకోవాలని భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా తెలిపాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో పుజారా మాట్లాడుతూ.. బ్రిస్బేన్ టెస్టులో బరిలోకి దిగే భారత తుది జట్టును పుజారా అంచనా వేశాడు. తుది జట్టులో ఏకైక మార్పు జరిగే అవకాశం ఉందని చెప్పాడు. బౌలింగ్ గురించి కాకుండా బ్యాటింగ్ గురించి ఈ మార్పు జరగొచ్చని తెలిపాడు. ‘ఒకే ఒక్క మార్పు జరగొచ్చని అనుకుంటున్నా. బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాలని అశ్విన్ స్థానంలో సుందర్‌ను తీసుకోవచ్చు.’ అని చెప్పాడు.
అలాగే, యువ పేసర్ హర్షిత్ రాణాను పక్కనపెడతారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అలా జరగకపోవచ్చన్నాడు. ‘తొలి టెస్టులో అతను సత్తాచాటాడు. రెండో టెస్టులో నిరాశపరిచాడు. అయితే, ఒక్క మ్యాచ్‌లో రాణించినంత మాత్రాన అతన్ని పక్కనపెడతారని అనుకోవడం లేదు. ’ అని చెప్పుకొచ్చాడు. మూడో టెస్టులో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బ్యాటింగ్ స్థానాలు మారొచ్చని వార్తలు వస్తున్నాయి.అయితే, పుజారా రెండో టెస్టులో బ్యాటింగ్ దిగిన స్థానాలనే కొనసాగించాడు. జైశ్వాల్‌తో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని, 6వ స్థానంలో రోహిత్ బ్యాటింగ్‌కు వస్తాడని తెలిపాడు.
పుజారా అంచనా వేసిన భారత్ తుది జట్టు
కేఎల్ రాహుల్, జైశ్వాల్, గిల్, కోహ్లీ, పంత్, రోహిత్(కెప్టెన్), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్.






