బాక్సింగ్ ఫెడరేషన్‌లో అడ్ హక్ కమిటీ ఏర్పాటు

by Ajay Maddhiboyina |

వ్యక్తిగత ఆసక్తులను పక్కన పెట్టి అందరం భారత క్రీడాలోకం కోసం పని చేద్దామని ఉష సూచించారు.

బాక్సింగ్ ఫెడరేషన్‌లో అడ్ హక్ కమిటీ ఏర్పాటు
X

- పీటీ ఉష నిర్ణయంపై హైకోర్టు స్టే

- ఉష తీరుపై గగన్ నారంగ్ మండిపాటు

- తన నిర్ణయాన్ని సమర్థించుకున్న పీటీ ఉషా

దిశ, స్పోర్ట్స్: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అడ్-హక్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష సమర్థించుకున్నారు. బీఎఫ్ఐ తమ ప్రాథమిక బాధ్యతలను విస్మరించిందని, అందుకే పాలనను చక్కదిద్దాలనే ఉద్దేశంతోనే అడ్-హక్ కమిటీని ఏర్పాటు చేశామని మంగళవారం పీటీ ఉష వెల్లడించారు. ఫిబ్రవరి 28న ఐఓఏ వైస్ ప్రెసిడెంట్ గగన్ నారంగ్ అడ్-హక్ కమిటీ ఏర్పాటు విషయంలో పీటీ ఉష ఏకపక్ష ధోరణిని ఎండగడుతూ లేఖ రాశారు. ఆమె చర్యల వల్ల అథ్లెట్ల సంక్షేమం మరుగున పడుతుందని దుయ్యబట్టారు. అడ్-హక్ కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీఎఫ్ఐ పిటిషన్ మేరకు ఢిల్లీ హైకోర్టు కూడా ఐఓఏ ఉత్తర్వులపై సమాధానం ఇవ్వాలని కోరింది. కాగా ఈ విషయంపై పీటీ ఉష స్పందిస్తూ.. అడ్-హక్ కమిటీ ఏర్పాటు వల్ల అథ్లెట్లు ఇబ్బందులు పడుతున్నారని గగన్ నారంగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కమిటీ ఏర్పాటు ఏకపక్ష నిర్ణయం కాదని. అది తప్పని సరిగా తీసుకోవాల్సిన చర్య అని ఉష పేర్కొన్నారు. అథ్టెట్ల మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏసియన్ గేమ్స్ 2026 సమీపిస్తున్నా.. ఇంకా ఫ్రెష్ టాలెంట్‌ను వెతకడానికి ఎలాంటి ప్రయత్నాలు బీఎఫ్ఐ చేయడం లేదని ఉష ఆరోపించారు. వ్యక్తిగత ఆసక్తులను పక్కన పెట్టి అందరం భారత క్రీడాలోకం కోసం పని చేద్దామని ఉష సూచించారు.

Next Story