- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PSL: మ్యాచులన్నీ కరాచీలోనే.. రావల్పిండిలో డ్రోన్ క్రాష్‌తో ఉలిక్కిపడ్డ పీసీబీ
రావల్పిండిలో పీఎస్ఎల్ మ్యాచ్ జరగడానికి ముందే స్టేడియం సమీపంలో ఒక డ్రోన్ క్రాష్ అయింది. దీంతో భయపడిన పీసీబీ.. మ్యాచులను కరాచీకి తరలించాలని అనుకుంటోంది.

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)కు పెద్ద షాక్. ఆపరేషన్ సిందూర్‌తో ఈ లీగ్ నిర్వహణపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. తాజాగా రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో ఒక డ్రోన్ క్రాష్ అవడంతో పీఎస్ఎల్ నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. ఈ స్టేడియంలో పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ మొదలవడానికి కొన్ని గంటలముందే ఈ డ్రోన్ ఘటన జరగడం గమనార్హం.
స్టేడియానికి సమీపంలోని ఒక రెస్టారెంట్‌పై ఈ డ్రోన్ కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పీఎస్ఎల్ నిర్వాహకులు రావల్పిండిలో జరగాల్సిన మ్యాచులన్నింటినీ రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఫ్రాంచైజీ ఓనర్లతో పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) అధికారులు సమావేశమయ్యారు.
కరాచీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య మిగతా లీగ్ మ్యాచులు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత, త్వరలోనే మారిన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పీసీబీ తెలిపింది.






