PSL 2025 షెడ్యూల్ కూడా ఖరారు..వేదిక, టైమింగ్స్ ఎప్పుడంటే ?

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ( PSL 2025) అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి

PSL 2025 షెడ్యూల్ కూడా ఖరారు..వేదిక, టైమింగ్స్ ఎప్పుడంటే  ?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ( PSL 2025) అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అటు ఇండియాలో జరిగే ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ను ( IPL 2025) కూడా నిరవధికంగా వాయిదా వేశారు. అయితే ఇప్పటికే ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ పునః ప్రారంభం పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB ) కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ నెల 15 లేదా 16వ తేదీలలో.. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును... పునః ప్రారంభం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లను రావాల్పిండి ( Rawalpindi), లాహోర్ ( Lahore) వేదికల్లో నిర్వహించాలని ప్రణాళికలు చేస్తున్నారు. విదేశీ ఆటగాళ్లకు సమాచారం అందిస్తామని కూడా ఇప్పటికే బోర్డు ప్రకటించింది.

అయితే అటు విదేశీ క్రికెటర్లు మళ్ళీ పాకిస్తాన్ రావాలంటే గజగజ వణికిపోతున్నారు. వాళ్లు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. విదేశీ క్రికెటర్లు రాకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈ టోర్నమెంటులో ఫైనల్ తో పాటు మొత్తం ఎనిమిది మ్యాచ్ లు ఉన్నాయి.

Next Story