ప్రొ రెజ్లింగ్ లీగ్ లోగో ఆవిష్కరణ.. ఏడేళ్ల తర్వాత మళ్లీ మొదలవుతున్న టోర్నీ

by Phanindra |

ప్రొ రెజ్లింగ్ లీగ్ లోగోను తాాజాగా ఆవిష్కరించారు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఈ టోర్నీ మళ్లీ మొదలవుతున్నది.

ప్రొ రెజ్లింగ్ లీగ్ లోగో ఆవిష్కరణ.. ఏడేళ్ల తర్వాత మళ్లీ మొదలవుతున్న టోర్నీ
X

దిశ, స్పోర్ట్స్: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) శాంక్షన్ చేసిన ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) లోగోను మంగళవారం నాడు ఆవిష్కరించారు. ఏడేళ్ల తర్వాత మళ్లీ పునఃప్రారంభమైన ఈ లీగ్.. వచ్చే ఏడాది జనవరిలో మొదలవనుంది. గతంలో నాలుగు సీజన్‌లు జరిగిన తర్వాత ఈ టోర్నీ నిరవధికంగా నిలిచిపోయింది. తాజాగా వచ్చే ఏడాది నుంచి ఐదో సీజన్ టోర్నీ మొదలు పెడతామని డబ్ల్యూఎఫ్ఐ ప్రకటించడం రెజ్లర్లలో కొత్త ఉత్సాహం నింపింది. అంతర్జాతీయ స్థాయికి, స్థానిక రెజ్లర్లకు మధ్య వారధిలా ఉండాలనే లక్ష్యంతోనే ఈ లీగ్ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. తద్వారా దేశంలో రెజ్లింగ్ స్థాయి పెరుగుతుందని వారు భావిస్తున్నారు.

Next Story