ఐపీఎల్ లో బంపర్ ఆఫర్.. ప్రియురాలితో క్రికెటర్ ఎంజాయ్

by velandi.Saikiran |

మూడో రౌండ్ లో బేస్ ధర రూ.75 లక్షలకు పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

ఐపీఎల్ లో బంపర్ ఆఫర్.. ప్రియురాలితో క్రికెటర్ ఎంజాయ్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసిన సంగతి తెలిసిందే. మొన్న డిసెంబర్ 16వ తేదీన ఈ మినీ వేలం అబుదాబిలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ మినీ వేలంలో గ్రీన్, ప‌తిరన, లివింగ్ స్టోన్ , కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది. అయితే, ఈ సారి టీమిండియా స్టార్ ఆటగాడు పృథ్వీ షా ( Prithvi Shaw )కు కూడా ఛాన్స్ దక్కింది. మొదటి రెండు రౌండ్లలో పృథ్వీ షా అన్ సోల్డ్ అయ్యాడు.

ఇక మూడో రౌండ్ లో బేస్ ధర రూ.75 లక్షలకు పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దీంతో పృథ్వీ షా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వచ్చే సీజన్ లో ఆడుతున్న నేపథ్యంలో తన ప్రియురాలితో కలిసి కేక్ కటింగ్ కూడా చేశాడు. ఆమెతో పృథ్వీ షా జాలీగా గడిపిన వీడియో కూడా బయటకు వచ్చింది. కాగా 2018 నుంచి 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకే పృథ్వీ షా ఆడుతున్నాడు. 2025లో అన్ సోల్డ్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ జట్టు తరఫున ఏడాది తర్వాత ఆడబోతున్నాడు పృథ్వీ షా. క్లిక్

Next Story