'అతడికి పొగరు ఎక్కువ.. పెద్ద స్టార్ అని ఫీలింగ్'.. టీమ్ ఇండియా ఓపెనర్‌‌పై శుభ్‌మన్ గిల్ చిన్ననాటి కోచ్ సంచలన కామెంట్స్

by Disha Web Desk 13 |
అతడికి పొగరు ఎక్కువ.. పెద్ద స్టార్ అని ఫీలింగ్.. టీమ్ ఇండియా ఓపెనర్‌‌పై శుభ్‌మన్ గిల్ చిన్ననాటి కోచ్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా ప్లేయర్ పృథ్వీ షాపై భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, శుభ్‌మన్ గిల్ చిన్ననాటి కోచ్ కర్సన్ ఘావ్రీ సంచలన కామెంట్స్ చేశాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత భారత క్రికెట్‌లో ఆ స్థాయి ఓపెనర్‌గా ఎదుగుతాడని భావించిన ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. వరుస వైఫల్యాలతో క్రమంగా టీమ్ నుంచి దూరమయ్యాడు. ఇటీవలే మళ్లీ టీమిండియాలోకి వచ్చిన షా.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. గిల్-షా ఇద్దరూ భారత్ తరఫున 2018లో అండర్ -19 ఆడినవాళ్లే. షా సారథ్యంలోనే గిల్ ఆ టోర్నీలో రెచ్చిపోయాడు. పృథ్వీ కూడా వరల్డ్ కప్ ప్రదర్శనలతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు.. గిల్ ఎక్కడున్నాడు..? షా ఎక్కడున్నాడు..? అని ప్రశ్నించాడు.

"పృథ్వీ తనను తాను ఓ స్టార్ లా ఫీల్ అవుతాడు. తననెవరూ టచ్ చేయలేరని.. తనకు తిరుగులేదనే పొగరుతో ఉంటాడు. కానీ అతడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. క్రికెట్‌లో ఏ ఫార్మాట్, టోర్నీ అయినా బ్యాటర్ అవుట్ కావడానికి ఒక్క బంతి చాలు.. క్రికెట్‌లో రాణించాలంటే నిబద్దతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం. నిరంతరం శ్రమిస్తేనే ఈ ఫీల్డ్‌లో నిలదొక్కుకుంటారు" అని ఘాటుగా కామెంట్స్ చేశాడు. ఇక IPL 2023 సీజన్‌లో పృథ్వీ షా చెత్త ప్రదర్శనతో 8 మ్యాచ్‌లలో 106 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యాడు.


Next Story