టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ...పృథ్వీ షా 2.0 లోడింగ్‌

by velandi.Saikiran |

పృథ్వీ షా, డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇవాళ జరిగిన రంజీ మ్యాచ్ లో పృథ్వీ షా ఈ డబుల్ సెంచరీ బాది

టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ...పృథ్వీ షా 2.0 లోడింగ్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా యంగ్ కుర్రాడు పృథ్వీ షా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న పృథ్వీ షా, డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇవాళ జరిగిన రంజీ మ్యాచ్ లో పృథ్వీ షా ఈ డబుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. చత్తీస్ ఘ‌డ్ తో జరుగుతున్న మ్యాచ్ లో మహారాష్ట్ర తరఫున 144 బంతుల్లోనే 200 మార్కు దాటేశాడు ఈ డేంజర్ కుర్రాడు పృథ్వీ షా.

ఇది రంజీ హిస్టరీ ఎలైట్ గ్రూప్ లో సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచ‌రీ కావడం గమనార్హం. కేవలం 150 బంతుల్లో మొత్తం 222 పరుగులు చేశాడు. ఇందులో 29 బౌండరీలు అలాగే ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఫిట్నెస్ సమస్యలు అలాగే ఫాంలేమీతో టీమ్ ఇండియాకు దూరమైన పృథ్వీ షా, దేశవాళీ క్రికెట్లో మాత్రం బాగా ఆడుతున్నాడు. కాగా ఇటీవ‌లే స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ ఖాన్ తో గొడ‌వ ప‌డి, వివాదంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే.

Next Story