- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియురాలితో బర్త్ డే వేడుకలు...ఆమె కౌగిలిలో టీమిండియా ప్లేయర్
పృథ్వీ షా ప్రియురాలు పేరు అకృతి అగర్వాల్ (Akriti Agarwal) అని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియాకు సంబంధించిన కుర్ర క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో ఛాన్స్ దక్కించుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు. గతంలో అవకాశం వచ్చినప్పటికీ, ఆ సమయంలో విఫలమయ్యాడు. ఇక ఇప్పుడు దేశవాళి క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న పృథ్వీ షా, తరచూ వార్తల్లో కూడా నిలుస్తున్నాడు. తాజాగా తన ప్రియురాలితో కలిసి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు ఈ 26 ఏళ్ల కుర్రాడు షా.
వాస్తవంగా పృథ్వీ షా పుట్టినరోజు నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు అభిమానులు. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం తన ప్రియురాలితో డేట్ కు వెళ్లిన పృథ్వీ షా, ఆమెతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పృథ్వీ షా ప్రియురాలు పేరు అకృతి అగర్వాల్ (Akriti Agarwal) అని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. ఇప్పుడనే కాదు, గతంలో కూడా ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. క్లిక్






