సంజయ్ మంజ్రేకర్ రికార్డు బ్రేక్ చేసిన టీమిండియా యువ ఆటగాడు..

by Hajipasha |   (  Updated:2023-01-11 11:29:27  IST  )

Prithvi Shaw Breaks Record Of Gavaskar, Manjrekar, Smashes Triple-Ton In Ranji Trophy

సంజయ్ మంజ్రేకర్ రికార్డు బ్రేక్ చేసిన టీమిండియా యువ ఆటగాడు..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా అరుదైన రికార్డు బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫిలో భాగంగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో ఈ ముంబాయి ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. 384 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లతో 379 పరుగులు చేశాడు. పృథ్వీ షా ఈ ట్రిపుల్ సెంచరీతో భారత మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటిదాకా రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు 377 చేసిన రికార్డ్ మంజ్రేకర్ పేరిట ఉండగా.. తాజాగా 379 పరుగులు చేసిన పృథ్వీ షా మంజ్రేకర్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా రంజీ ట్రోఫీలో ఒక ఇన్సింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో షా రెండవ స్థానంలో నిలువగా.. మహారాష్ట్ర మాజీ ప్లేయర్ బిబి నింబాల్కర్ 443 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.

Also Read...

సచిన్‌తో కోహ్లీకి పోలికా.. గంభీర్ షాకింగ్ కామెంట్స్

Next Story